సెప్టెంబర్ 10, నల్లా సమాచార్ న్యూస్ /జహీరాబాద్ :
నియోజకవర్గంలోని చాకలి అయిలమ్మ 38వ వర్ధంతి సందర్భంగా జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చాకలి అయిలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటీ మాణిక్ రావు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సాయుద పోరాటంలో అలుపెరగని పోరు చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ అని, భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరాడిన యోధురాలు దొరలు, దేశ్ముఖ్లు, రజాకార్ల దురాగతాలను ఎదిరించిన ధీశాలి. కొంగు నడుముకు చుట్టి, కొడవలి చేపట్టి నైజాం సర్కార్తో పాటు విస్నూర్ దొరల ఆగడాలను ఎదిరించిన వీరనారి చాకలి (చిట్యాల) ఐలమ్మ,దేశంతోపాటు,ప్రపంచవ్యాప్తంగా భూపోరాట ఉద్యమాలకు ఐలమ్మ మార్గదర్శకం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ మొహిఉద్దిన్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డీ, నాయకులు ఇజ్రాయేల్ బాబీ, డివిజన్ అధ్యక్షులు బక్కన్న, టౌన్ ప్రెసిడెంట్ సందీప్ రాజ్ ,వెంకట్ ,రాజు ఉపాధ్యక్షులు మాణిక్యం, మొగులప్ప, రాజు, రాములు, జనరల్ సెక్రెటరీ రాజు కృష్ణ, శ్రీకాంత్, చందన్, వడ్డీ నరసింహ, విష్ణువర్ధన్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.