Cabinet Installation నారాయణ పాఠశాలలో ఘనంగా క్యాబినెట్ ఇన్స్టాలేషన్
Cabinet Installation నారాయణ పాఠశాలలో ఘనంగా క్యాబినెట్ ఇన్స్టాలేషన్
నారాయణ పాఠశాలలో ఘనంగా క్యాబినెట్ ఇన్స్టాలేషన్
నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి) శేరిలింగంపల్లి నియోజకవర్గం: మదీనాగూడలోని నారాయణ పాఠశాలలో విద్యార్థుల క్యాబినెట్ ఇంస్టాలేషన్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి మియాపూర్ సి. ఐ.ప్రేమ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థి దశ నుండే నాయకత్వ పటిమను పెంపొందించడానికి విద్యార్థులు వారి అవసరాలను, హక్కులను, బాధ్యతలను గుర్తించే విధంగా క్యాబినెట్ ఏర్పాటు చేయడం ఎన్నికలు నిర్వహించడం తద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను మేల్కొల్పడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. ఈ సందర్భంగా పాఠశాల యజమాన్యాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాధికని అభినందించారు అనంతరం జరిగిన చిన్నారుల ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ మరియు క్విజ్ కాంపిటేషన్ లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారుఈ కార్యక్రమంలో ఎస్సై జగదీష్ గౌడ్ ఏజీఎం వేణుగోపాల్ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు