ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో పాడిగేదేతో పాటు రైతు మృతి 

బచ్చన్నపేట మండలం నారాయణపురం గ్రామంలో జరిగిన సంఘటన

ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో పాడిగేదేతో పాటు రైతు మృతి

జూలై 08, నల్లా సమాచార్ న్యూస్ / బచ్చన్నపేట :

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నారాయణపురం గ్రామంలో పశువులను కాయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు తన గేదెతో పాటు కరెంట్ షాక్ గురై ఒక వ్యక్తి మరణించిన సంఘటన జరిగింగి. బచ్చన్నపేట ఎస్ఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం, ఫిర్యాదురాలు మృతుడి తల్లి జంగిడి పార్వతమ్మ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. తన మొదటి కొడుకు జంగితి స్వామి తండ్రి మల్లయ్య, 32సం, ఈ రోజు ఉదయం 7 గంటలకు పశువులు కాయడానికి బావి దగ్గరకు వెళ్ళగా మాసపేట బుచ్చిరెడ్డి భూమిలో కరెంటు తీగలు కిందకు వేలాడి ఉన్నాయి. ఆ తీగలు బర్రె కొమ్ము లో ప్రమాదవశాత్తు చిక్కుకొనగా, దాన్ని తొలగించడానికి వెళ్లి బర్రెతోపాటు తన కొడుకు చనిపోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది గమనించిన స్థానికులు కరెంటు సప్లై నిలిపివేశారని, అక్కడి నుంచి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన పై తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బచ్చన్నపేట ఎస్సై సతీష్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.