తెలంగాణ రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిన బీఆర్ఎస్:మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి

తెలంగాణ రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి

 

తెలంగాణ రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిన బీఆర్ఎస్: మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి) హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన బిఅర్ఎస్

కాంగ్రెస్ మోసపూరిత హామీలంటూ ఆరోపణ చేస్తున్న బిఅర్ఎస్ నాయకులు ఆత్మస్తుతి చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి సూచించారు

బుధవారం కందుకూరు మండలం కేంద్రంలో విలేకరులకు అందజేసిన పత్రికా ప్రకటనలో

 

ఎన్నో ఉద్యమాల ఫలితంగా చివరకు 2014 జూన్ 02న 29వ రాష్ట్రంగా “తెలంగాణ రాష్ట్రం” ఆవిర్భవించింది. ఎన్నో ఆశలు, ఆకాంక్షల మధ్య ఉద్యమ పార్టీ నాయకుడిగా కెసిఅర్ కి అధికారం అప్పగిస్తే, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్ర ఖజానాను లోటు బడ్జెట్ రాష్ట్రంగా అత్యంత దిగువకు దిగజార్చిన ఘనత బిఅర్ఎస్ ప్రభుత్వానిది. అబద్దపు పునాదుల మీద ఎదిగిన బిఅర్ఎస్ ప్రభుత్వ పాలన పదేళ్ల రాజ్యం- ప్రగతి పూజ్యం

గురువింద రీతి- బిఆర్ఎస్ నీతి

ప్రజలు ఛీ కొట్టినా మార్పేది

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు కాలేదు. అయనా ఆరు గ్యారంటీలతో పాటు మెనిఫేస్టోలో పెట్టిన హామీలను అమలు చేసేందుకు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనతో ప్రజలవద్ద దరఖాస్తులను తీసుకుని వాటిని అమలు చేయాటానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేసింది‌.

అయనా బిఅర్ఎస్ నాయకులు గృహనిర్మాణం ఏది ?రైతు రుణమాపీ ఏది ఉద్యగ నియామకం ఎది అని అడుగుతున్న బిఅర్ఎస్ నాయకులు మీ యొక్క నీతులు అడిగే ముందు వెనకాల తిరిగి చూడాలి మీరు చెప్పిన ఇచ్చిన హమీలు10 సంవత్సారాలు అయిన ఇంటికో ఉద్యోగం లేదు, నిరుద్యోగ భృతి లేదు దళిత బందు లేదు, రెండు పడకల గదులు లేవు ,గృహ నిర్మాణం లేదు ఇలా అనేక హామీలకు దిక్కులేదు. అతి తక్కువ బడ్జెట్ తో లక్షల కోట్ల ఆస్తులు సృష్టించింది కాంగ్రెస్..

లక్షల కోట్ల అప్పులు చేసి బీఆర్ఎస్ సృష్టించిన ఆస్తులు సున్నా బిఅర్ఎస్ నాయకులుకు అబద్ధాలే ఆయుధాలు.. వంచనలే సిద్ధాంతాలు..నాటకాలే వారికి తెల్సిన విద్యలు.. వారు ఇచ్చి తప్పిన హామీలకు లెక్కలేదు..

వారికింకా అడిగే హక్కు లేదు..

ఈ తెలంగా ప్రజలు మరువరు మీరు పెట్టిన గోస.. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కూడా మీపై లేనే లేదు భరోసా..

ముక్కు నేలకు రాసినా.. పొర్లి పొర్లి దండాలు పెట్టినా..

పారవు మీ పాచికలు. పార్లమెంట్ ఎన్నికలలో తప్పవు బిఅర్ఎస్ కు శంకరగిరి మాన్యాలు.

 

కప్పాటి పాండురంగా రెడ్డి

Leave A Reply

Your email address will not be published.