Serilingampally :శేరిలింగంపల్లి ఎంఎల్ఏ టికెట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బండి రమేష్ :

Serilingampally శేరిలింగంపల్లి ఎంఎల్ఏ టికెట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బండి రమేష్ కేసీఆర్ తో తేల్చుకుంటా: బండి రమేష్

శేరిలింగంపల్లి ఎంఎల్ఏ టికెట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బండి రమేష్, కెసిఆర్ తో తేల్చుకుంటా బండి రమేశ్

 

నల్లా సమాచార్ న్యూస్ (శేరిలింగంపల్లి బ్యూరో చీఫ్):

శేరిలింగంపల్లి నియోజకవర్గం ఏంఎల్ ఏ టికెట్ ప్రకటనపై తీవ్రంగా , కేసీఆర్ పై అసంతృప్తి ప్రకటించిన బండి రమేష్. నియోజకవర్గం పుట్టినప్పుడే ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం నాకు వున్నదని బండి రమేష్ గుర్తుచేశారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కెసిఆర్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్లు డిక్లేర్ చేసిన సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గానికి తనకు టికెట్ రాకపోవడంతో బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ మియాపూర్ లోని తన క్యాంప్ ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ …. ఇప్పటివరకు పార్టీ కోసం మీరిచ్చిన అన్ని బాధ్యతలను తూ.చా. తప్పకుండా పనిచేశానని అలాంటప్పుడు తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం బాధాకరంగా ఉందని బండి రమేష్ తన ఆవేదనని వ్యక్తం చేశారు. నాకంటే పార్టీలోకి వెనక  వచ్చిన వాళ్లకు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు టికెట్లు ఇచ్చారు అని, తనకు ఇప్పటివరకు ఏ పదవి ఇవ్వకపోవడం చాలా బాధగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 

18 సంవత్సరాల క్రితం రాజకీయంలో అడుగుపెట్టిన రాజకీయ నాయకునిగా గుర్తింపు నిచ్చింది ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి, అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్ కి రుణపడి ఉంటా అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఆర్గనైజేషన్ సెక్రటరీగా పని చేశానని. చంద్రబాబు ఆదేశాల మేరకు 2014 లో అరికెపూడి గాంధీ విజయం కోసం తాను ఎంతో కృషి చేశానని చెప్పారు. 2016 జిహెచ్ఎంసి ఎలక్షన్ సమయంలో కేసీఆర్ ఆహ్వానించారని, తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీలో చేరానని, కార్పొరేటర్ గెలిపించేందుకు కృషి చేశానని పది టికెట్లు గెలిపించామన్నారు. ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా ఎంతో కృషి చేశాను. ప్రతి ఎన్నికల్లో తన వంతు కృషి చేశానని తెలిపారు.సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జిగా 2018 ఎన్నికల్లో సికింద్రాబాద్ లో ఆరు అసెంబ్లీ సీట్లు గెలిపించేందుకు తన వంతు కృషి చేశాను హుజురాబాద్ లో ఐదు క్లస్టర్స్ అబ్జర్వర్గా ఉన్నాను.

ప్రజల సేవ చేయడానికి రాజకీయాలకు వచ్చాను కానీ నాకు అవకాశం రాలేదు .

పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పనిచేశానని తెలిపారు.

కేటీఆర్ తెలంగాణకు పోర్టికల్ హీరో, రోల్డ్ మాడల్ అని,

సిరిసిల్ల లో 1,05,000 మందిని పార్టీ సభ్యత్వం చేయించాం అని తెలిపారు.

 

శేరిలింగంపల్లి నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని అడిగాను కేటీఆర్ మాట ఇచ్చారు అందుకోసమే పార్టీ ఆఫీసును  ఓపెన్ చేశానని బండి రమేష్ తెలిపారు.

18 సంవత్సరాలుగా పార్టీలకు సేవ చేస్తూ వచ్చాను ప్రజలకు సేవ చేసే అవకాశం ఈసారి వస్తుందని ఆశిస్తున్నాను. ఆ అవకాశాన్ని కేసీఆర్ కల్పిస్తారని అనుకున్నాను కానీ ఈరోజు నా పేరు అనౌన్స్మెంట్ చేయకపోవడంతో చాలా బాధగా ఉందని అన్నారు.

ఏమాత్రం అవకాశం ఉన్న టికెట్టు తనకు ఇవ్వాలని  కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.ప్రజల తోటి ఉంటా ప్రజల కష్ట సుఖాలతో పాలు పంచుకుంటానని బండి రమేష్ తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.