BRS : బిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసిన నల్ల మనోహర్ రెడ్డి
గత 3 పర్యాయాలు గా ఓపిక తో పార్టీ గెలుపు కొరకు ఎనలేని కృషి చేసా
నల్లా సమాచార్ న్యూస్ / పెద్దపల్లి :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ప్రవేశపెట్టిన టికెట్ల జాబితా వ్యవహారం లో భాగంగా గత 15 సంవత్సరాల నుండి బిఆర్ఎస్ పార్టీ లో ఉంటూ ప్రజా సేవా చేస్తూ పార్టీ చెప్పిన కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజా శ్రేయస్సే ద్యేయం గా పనిచేస్తున్న యువ న్యాయకత్వానికి అవకాశం ఇవ్వకుండా 70 సంవత్సరాల వ్యక్తికి అవకాశం ఇచ్చి గత 3 పర్యాయాలు గా ఓపిక తో పార్టీ గెలుపు కొరకు కృషి చేసిన నాకు రాజకీయాలలో ఉత్సాహం ఉన్న అవకాశం ఇవ్వకుండా యువకులను అనగదొక్కుతున్న ప్రయత్నానికి చింతించి నేడు బిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేయడం జరిగింది అని ఆయన అన్నారు. అలాగే ఈ సందర్బంగా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు నేను ఈ ఎన్నికలలో నూటికి నూరు శాతం బరిలో ఉంటున్నానని తెలియజేసారు.