పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం ఇంటింట ప్రచారంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు

పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం ఇంటింట ప్రచారంలో కాళ్లు మొక్కుతున్న కోడూరి శివకుమార్ గౌడ్.

నవంబర్ 11, నల్లా సమాచార్ న్యూస్ / బచ్చన్నపేట :

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలో పల్లా గెలుపే లక్ష్యంగా ఇంటింటికి ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్తూ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ కారు గుర్తుపై ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అని తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరిన్ని సంక్షేమ పథకాలును అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో మరింత వెలుగులు నింపుతుందని అన్నారు. ఏ ఇంటికి వెళ్లిన ఘన స్వాగతాలు పలుకుతున్నారని తెలిపారు. గ్రామ శాఖ అధ్యక్షులు కోపురపు సిద్దారెడ్డి, వేముల లక్ష్మణ్ గౌడ్, మల్గ సిద్దిరాములు, కోడూరి శివ కుమార్, అంబాల ఆగయ్య, వేముల సంపత్, గద్దల రాకేష్, రమేష్ రెడ్డి, బాపురెడ్డి, అభినయ, శ్రీనివాస్, రమణా చారి, శివ కుమార్, ప్రశాంత్, రమేష్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.