బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రజల పాలిట శాపంగా మారింది: జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు

బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రజల పాలిట శాపంగా మారింది: జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు

బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రజల పాలిట శాపంగా మారింది..

ఎల్.ఆర్.ఎస్ కు VRS ఇచ్చింది బీఆర్ఎస్,నేడు నాటకాలు చేయడం హాస్యాస్పదంగా ఉంది..

గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయం వద్ద బిఆర్ఎస్ నాయకులు చేసిన ధర్నాను శుద్ధి చేసే విధంగా పసుపు నీళ్లతో శుద్ధి చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్,ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి విజయ రెడ్డి ,మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ ,కాంగ్రెస్ పార్టీ జి.హెచ్.ఎమ్.సి ఫ్లోర్ లీడర్ రాజశేఖర రెడ్డి ,ఉప్పల్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ,రెహ్మత్ నగర్ కార్పొరేటర్ సి.ఎన్ రెడ్డి అనంతరం పసుపునీళ్ళతో కడిగి ముగ్గులు వేసిన మహిళా కార్పొరేటర్లు..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే విధంగా 2007లో తీసుకువచ్చిన జి.ఓ వల్ల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 50 వేల అప్లికేషన్లు ఉన్నాయని,2015లో నూతన తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు లక్ష యాభై వేల అప్లికేషన్లు ఉన్నాయని,2020 లో 25లక్షల అప్లికేషన్లు వచ్చినవి వాటిని పరిష్కరించకుండా పెండింగులో పెట్టి ఈరోజు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ధర్నాలు చేయడం దయ్యాలు నీతులు వల్లించినట్టు ఉందని అన్నారు..

గ్రేటర్ హైదరాబాద్ లో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను ప్రజలకు తెలియచేసే విధంగా వాటిని ప్రక్షాళన దిశగా మా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో మున్సిపల్ శాఖమంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు నేతృత్వంలో ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని అన్నారు..

ఈ కార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.