BRS బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో భారీ చేరికలు

BRS నుంచి కాంగ్రెస్ లోకి జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో భారీ చేరికలు

కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషం వ్యక్తపరుస్తున్నారు

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి) శేరిలింగంపల్లి

వివేకానంద నగర్ మరియు చందానగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ నుంచి భారీగా చేరికలు

కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..

శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని మంచి వ్యక్తి సేవ గుణంగల నేత జగదీశ్వర్ గౌడ్ అన్నకు తోడుగా అడుగులు అడుగై ముందుకు నడుస్తామని కార్యకర్తలు తెలిపారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాట్లాడుతూ.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తుందని,ప్రజా పాలనకు నిదర్శనంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని జగదీశ్వర్ గౌడ్ హామీ ఇచ్చారు.కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇల్లు,మహాలక్ష్మి పథకం రైతు భరోసా,గృహలక్ష్మి,యువ వికాసం,వృద్ధులకు,వికలాంగులకు చేయూత,6 గ్యారంటీ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతాయని కాంగ్రెస్ పార్టీ అందరికీ న్యాయం చేసే పార్టీగా మీ అందరికీ తెలుసా అని కాంగ్రెస్ పార్టీతోనే అన్ని విధాలుగా ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు.

 

వివేకానంద నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంటెస్టెడ్ కార్పొరేటర్ భాష్పాక నాగమణి యాదగిరి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ నాయకులు వివేకానంద నగర రామకృష్ణ నగర్ కాలనీ చెందిన ఆర్.లక్ష్మి,సంజీవ్,మైనారిటీ నాయకులు ఎం.డి యూసఫ్ మరియు దొంతి కార్తీక్ గౌడ్ ఆధ్వర్యంలో సీనియర్ బి.ఆర్.ఎస్ నాయకుడు అనిల్,మౌలాలి,గోపి,రాజు,రాములు,రమేష్, మరియు చందానగర్ డివిజన్ యువజన నాయకులు వెంకటేష్ తదితరులు శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

 

ఈ కార్యక్రమం లో భాషిపాక నాగమణి యాదగిరి, ముకయ్య, వెంకటేష్, నాగుల మల్లేష్,రాజు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.