నల్లా సమాచార్ న్యూస్ (ములుగు, భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో)
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం మండలంలోని బుట్టాయిగూడెం గ్రామంలో మొట్టమొదటిసారిగా చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీలో సోమవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ఐ సురేష్ సర్పంచ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్ఐ సురేష్ రక్త దానం చేశారు. ఈ కార్యక్రమంలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు ప్రకాష్ సాయి తేజ, బుద్ధ సందీప్, నరేడ్ల అశోక్, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది మెడికల్ ఆఫీసర్ మౌనిక, మురళి, మల్లికాంబ తదితరులు గ్రామస్తులు యువత పాల్గొన్నారు.