Mancherial : రక్త నిధి కేంద్రంలో ఘనంగా వెంకట సాయి జన్మదినోత్సవ వేడుకలు

రక్త నిధి కేంద్రంలో ఘనంగా వెంకట సాయి జన్మదినోత్సవ వేడుకలు

అక్టోబర్ 07, నల్లా సమాచార్ న్యూస్ / మంచిర్యాల :

శనివారం రోజు మంచిర్యాల పట్టణంలోని సంజీవయ్య కాలనీ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వెంకట సాయి కృష్ణ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తనిధి కేంద్రంలో తన మిత్ర బృందంతో కలిసి 15 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ అమూల్యమైన రక్తాన్ని డొనేట్ చేసినారు .ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్న లైన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఫర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరియు రక్త నిధి కేంద్ర ఇంచార్జ్ లయన్ వి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తన జన్మ దినోత్సవం సందర్భంగా మిత్రబృందంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చే రక్త దానం చేయడం అభినందనీయమని జన్మదినం జరుపుకుంటున్న వెంకట సాయి తో కేక్ కట్ చేపించి శాలువాతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ శిబిరంలో రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి రెండు సంవత్సరాల వ్యవధి లక్ష రూపాయలు విలువగల ఉచిత ప్రమాద బీమా పాలసీలను అందజేస్తానని తెలియపరిచినారు . తదుపరి రక్త నిధి కేంద్ర ఇన్చార్జ్ మధుసూదన్ రెడ్డి మరియు రెడ్ కార్ జిల్లా కోశాధికారి పడాల రవీందర్ ఇరువురు వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు . ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ మెంబర్ కాజా మియా, బ్లడ్ మోటివేటర్స్ అబ్దుల్ రహీం, ప్రేమ్ కుమార్ సింగ్ , ప్రణయ్ యూత్ ప్రెసిడెంట్, భరత్ , ప్రశాంత్ , మహమ్మద్ నిహాల్, చిప్పకుర్తి అభిషేక్ , మోతే శేఖర్, రాజు , రఘు వంశీ , యాదగిరి, మనోజ్ , రాజశేఖర్ మరియు రక్త నిధి కేంద్ర సిబ్బంది కే మాధవి తదితరులు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.