రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండించిన మొవ్వ సత్యనారాయణ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే

రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండించిన మొవ్వ సత్యనారాయణ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే

సెప్టెంబర్ 14, నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి) :

నిరుద్యోగులను మోసం చేసిన బి.ఆర్.ఎస్ పాలన తీరుకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన 24 గంటల ఉపవాస దీక్షను భగ్నం చేయడం మరియు ఈ అక్రమ అరెస్ట్ ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ తీవ్రంగా ఖండిస్తూ…నిరసన తెలిపారు.


ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం చేసే అరాచకాలకు అంతు లేకుండా పోతుంది, ఈ పోలీసులు కూడా బి.ఆర్.ఎస్ ప్రభుత్వానికి తొత్తులుగా మరి వారి అనుసంధానంలో పని చేస్తున్నారు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కేసీఆర్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ దీక్ష చేస్తే.. అక్రమంగా అరెస్టు చేస్తారా….అని మొవ్వా సత్యనారాయణ ప్రశ్నించారు.

ఈ కార్యక్రమం లో కొరదల నరేష్, ప్రభాకర్ యాదవ్ ,జానకి రామరాజు, రవీందర్ రావు, చింతకింది గోవర్ధన్ గౌడ్మ, మహిపాల్ రెడ్డి, మూల అనిల్ కుమార్ గౌడ్, స్వామి గౌడ్, నరేందర్ ముదిరాజ్, శాంతిభూషణ్ రెడ్డి, వీరయ్య చారీ, దుర్గాప్రసాద్ ,చిట్టారెడ్డి ప్రసాద్ శ్రీధర్, నర్సింగ్, కృష్ణ, జగన్ గౌడ్, బాబూరెడ్డి, రత్న కుమారి, రేణుక, ఆనంద్, శ్రీనివాస్ చారీ, పవన్, రఘురామ్, జగదీశ్ కుమార్, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, మోర్చాల నాయకులు, కార్యకర్తలు, మరియు వివిధ అనుబంధ సంఘాల వారు అందరూ కలిసి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.