శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ కు భారీ షాక్
.. కాంగ్రెస్ పార్టీలో చేరిన జిహెచ్ఎంసి ఫ్లోర్ లీడర్ జగదీశ్వర్ గౌడ్
-కండువా కప్పిన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి
..శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ టికెట్ ఖరారు
అక్టోబర్ 17, నల్లా సమాచార్ న్యూస్ / శేర్లింగంపల్లి :
జిహెచ్ఎంసి ఫ్లోర్ లీడర్ అయిన మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, ఆయన సతీమణి హఫీజ్ పేట కార్పొరేటర్ పూజిత కారు దిగి చేయి అందుకున్నారు.
అధికార పార్టీ నుండి శేరిలింగంపల్లి టికెట్ ఆశించి భంగపడిన జగదీశ్వర్ గౌడ్ పార్టీకి గుడ్ బై చెప్పారు.
పెద్దమ్మ గుడిలో పూజలు చేసిన అనంతరం జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసంలో కలిశారు.
టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పూజిత జగదీశ్వర్ గౌడ్ తో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు అనుచరులు రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.