పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం

- జనగామ డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం

– భువనగిరి పార్లమెంటు ఎన్నికల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం.

– తెలంగాణ రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాలు గెలుస్తాం.

– జనగామ డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

– కాంగ్రెస్ పార్టీ లోకి భారీ చేరికలు

మార్చి 28, నల్లా సమాచార్ న్యూస్ / జనగామ :

గత ప్రభుత్వం అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలపై అనేక సందర్భాలలో పోరాటం చేసిన ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం శ్రమించిన నాయకుడు చామాల కిరణ్ కుమార్ రెడ్డి ని‌ ఎంపి గా గెలిపించాలని జనగామ డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు.గురువారం‌ జనగామలో జరిగిన కార్యక్రమంలో ఆయ‌న మాట్లాడారు. అధిష్టానం గుర్తించి భువనగిరి టికెట్ ఇచ్చిందని, విజయం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంకణ బద్ధులై పార్టీ విజయానికి అహర్నిశలు కృషి చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో 14 పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని, కార్యకర్తలు భువనగిరి పార్లమెంటు ఎన్నికల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి జనగామ మండలంలోని వివిధ గ్రామాల మాజీ సర్పంచులు , ఎంపీటీసీలు, జిల్లా నాయకులు 200 మందిని పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు పెద్దరాంచర్ల గ్రామం నుండి మాజీ సర్పంచ్ వల్లాల మల్లేశం, ఎల్లంల గ్రామం నుండి జనగామ వీరేందర్ రెడ్డి, జనగామ కౌన్సిలర్ అరవింద్, గ్రామ శాఖ అధ్యక్షులు ఎండి రహీం వార్డ్ మెంబర్ లు పల్లె వెంకటేష్, పల్లె సురేష్ , బుర్ర రాజశేఖర్ ,గ్రామ ఉపాధ్యక్షులు కలకుంట్ల శ్యామ్ యూత్ అధ్యక్షులు అర్జున్,జనగామ మండల ఎంపీటీసీ పోరం అధ్యక్షులు బండ లక్ష్మి వెంకటేష్, కొంతం వెంకటేష్, బిర్రు మధు, అందే సత్యనారాయణ, సబ్బాని పరమేష్ చేరారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు చెంచారపు శ్రీనివాస్ రెడ్డి, చెంచారపు బుచ్చిరెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శివరాజ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వంగాల కల్యాణి,మండల ఇంఛార్జి లింగాల నర్సీ రెడ్డి,సేవాదల్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ సుంకరి శ్రీనివాస్ రెడ్డి ,

పిఏసిఎస్ చైర్మన్ నిమ్మత్ మహేందర్ రెడ్డి ,పిఎసిఎస్ డైరెక్టర్ వంగాల మల్లారెడ్డి, మేడ శ్రీనివాస్ , జక్కుల వేణు యాదవ్ ,జనగామ ఉమాపతి రెడ్డి ,

బొట్ల నర్సింగరావు, జాఫర్ షరీఫ్, బడికే కిష్టస్వామి,

చిర్రా హన్మంతరెడ్డి,బక్క శీను, గోలుసుల దుర్గేశ్, మారబోయిన ప్రకాష్ రహీం పెద్దరాంచర్ల గ్రామ శాఖ అధ్యక్షులు వార్డు మెంబర్ సురేష్, వెంకిర్యాల గ్రామ శాఖ అధ్యక్షులు ప్రసాద్, ఏదునూరి రవి, బిర్రు సత్యనారాయణ, ఈర్ల లక్ష్మణ్,బక్క ప్రవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.