కొమ్మూరి కి ఎంపీ సిటు కేటాయించాలి

కొమ్మూరి కి ఎంపీ సిటు కేటాయించాలి.

-కాంగ్రెస్ సీనియర్ నాయకులు నూకల బాల్ రెడ్డి

డిసెంబర్ 29, నల్లా సమాచార్ న్యూస్ / బచ్చన్నపేట :

జనగామ జిల్లా బచ్చన్నపేట మాజీ ఎమ్మెల్యే, అభివృద్ధి ప్రదాత జన హృదయ నేత జనగామ జిల్లా డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డికి భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీటు కేటాయించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు నూకల బాల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో జనగామ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్ప బి ఆర్ ఎస్ పార్టీ ఇలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్న కొమ్మూరి ప్రతాపరెడ్డి గత చేర్యాల ప్రస్తుత జనగామ నియోజకవర్గాన్ని సస్య శ్యామలం అయ్యేవిధంగా ప్రాజెక్టు నిర్మాణాలు చేసి కెనాల్ కాలువలు తవ్వించి బీడు భూములకు నీటిని అందించి రైతుల కళ్ళల్లో రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన కొమ్మూరి ప్రతాపరెడ్డికి భువనగిరి ఎంపీ సీట్ కేటాయించాలని అన్నారు. వారు ఎంపిక గెలిస్తే జనగామ నియోజకవర్గం అలాగే అన్ని నియోజకవర్గాలు అభివృద్ధికి నాంది పలుకుతుందని అన్నారు. వారికి ఎంపీ సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానం మీడియా ద్వారా కోరుతున్నట్టుగా తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.