సెప్టెంబర్ 10, నల్లా సమాచార్ న్యూస్ / బచ్చన్నపేట :
తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక భోనాల పండగ ఉత్సవాలను శ్రావణమాసం సందర్భంగా జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లి లో గౌడ సంఘం తరపున ఎల్లమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు గొల్ల పల్లి మల్లేష్, ఉప సర్పంచ్ బూడిద శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ గొల్ల పల్లి అంజేయులు గౌడ్, పాండవుల మల్లేశం, గొల్లపల్లి తిరుపతి, మంతపురి సుధాకర్, తిరుపతి, గౌడ సంఘం పెద్దలు యువకులు టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.