బచ్చన్నపేట పశువుల అంగడి వేలంపాట

బచ్చన్నపేట పశువుల అంగడి వేలంపాట

వేలం లో 3.89 లక్షలకు దక్కించుకున్న బొడిగం వెంకట్ రెడ్డి

జూన్ 15, నల్లా సమాచార్ న్యూస్ / బచ్చన్నపేట :

బచ్చన్నపేట మండల కేంద్రంలోని పశువుల అంగడి వేలంపాట స్థానిక గ్రామ పంచాయతీ వద్ద ఎంపీడీవో రఘురామకృష్ణ, స్పెషల్ ఆఫీసర్ వినోద్ కుమార్, పంచాయతీ కార్యదర్శి అనిల్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేలంలో మండల కేంద్రానికి చెందిన బొడిగం వెంకట్ రెడ్డి రూ. 3.89 లక్షలకు వేలం లో దక్కించుకున్నారు. డక్క వేలం బసిరెడ్డి పల్లికి చెందిన తేలు అంజయ్య రూ.16000/- లకు దక్కించుకున్నారు. తైబజార్ వేలం వాయిదా పడినట్టు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు , బొడిగం వెంకటరెడ్డికి ,తేలు అంజయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.