Bathukamma : తెలంగాణ ఆడపడుచులకు సిఎం కెసిఆర్ తోబుట్టువు

తెలంగాణ ఆడపడుచులకు సిఎం కెసిఆర్ తోబుట్టువుగా నిలుస్తున్నారు.

అక్టోబర్ 05, నల్లా సమాచార్ న్యూస్ / బచ్చన్నపేట : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి ప్రభుత్వం పంపిన బతుకమ్మ చీరెలను గ్రామంలో లోని మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొన్నె గ్రామ సర్పంచ్ వేముల వెంకట్ గౌడ్, ఎంపీటీసీ మల్గ నర్సమ్మ, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కొప్పరపు సిద్దారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఆడపడుచులకు సిఎం కెసిఆర్ తోబుట్టువుగా నిలుస్తున్నారు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి ఉపేందర్, కారోబార్ శ్రీనివాస్, గ్రామ పంచాయతీ సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.