గుళ్ళల్లో చోరీలకు పాల్పడిన దొంగ అరెస్ట్

గుళ్ళల్లో చోరీలకు పాల్పడిన దొంగ అరెస్ట్

కోర్టులో హాజరు 14 రోజుల రిమాండ్ విధింపు

ఫిబ్రవరి 06, నల్లా సమాచార్ న్యూస్ / బచ్చన్నపేట : పలు గ్రామాల్లోని దేవాలయాల్లో దొంగతనం చేసినటువంటి వ్యక్తిని బచ్చన్నపేట మండల పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ పంపారు. ఈ సందర్భంగా బచ్చన్నపేట ఎస్సై సతీష్ వివరాలు తెలియజేస్తూ తేదీ 05-02-2024 రోజున పెట్రోలింగ్ లో భాగంగా బచ్చన్నపేట బస్ స్టాండ్ వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పదం గా కనిపించడం తో అతడిని పట్టుకొని విచారించగ మాచర్ల రాజు తండ్రి పేరు దాసు, వయస్సు 48 సంవత్సరాలు, వృత్తి కూలీ పని నివాసం మలకపెట్ గ్రామం నర్మెట్ట మండలం కాగా ఇతడు గత 6 నెలల క్రితం పోచన్నపేట దుర్గా మాత ఆలయంలో, సాల్వపూర్ కొండ పోచమ్మ ఆలయాలలో దొంగతనం చేసినట్లు ఒప్పుకోవడం తో అతడి వద్ద దొంగిలించిన సొత్తు రికవరీ చేసి అతడిని ఈ రోజు జనగామ కోర్టు లో హాజరు పరచగా కోర్టు వ్యక్తి కి 14 రోజుల రిమాండ్ విదించింది. ఈ కేసులో దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఎస్సై సతీష్, కానిస్టేబుల్ లు అనిల్, జమాలుద్దీన్ లను ఏసిపి దేవేందర్ రెడ్డి, సిఐ సాయి రమణ అభినందిచారు.

Leave A Reply

Your email address will not be published.