డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ వర్దంతి

నివాళులు అర్పించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ వర్దంతి సందర్భంగా నివాళులు అర్పించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

నల్లా సమాచార్ న్యూస్ / శేరిలింగంపల్లి :

భారతదేశ ప్రజాలకు ఆదర్శవంతులు, నిబద్ధత సచ్చీలత దళిత జనోద్ధరణ కృషీవలడు, స్వేచ్చ సమానత్వం, సామాజిక న్యాయం సౌభ్రాతుత్వం పై దేశ ప్రజలను చైతన్యం చేసి, నిమ్న వర్గాల నుండి ఉన్నత స్థానాలను అధిరోహించిన డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ వర్దంతి సందర్భంగా 124 డివిజన్ పరిధిలోని PJR నగర్ లో డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ Dr. బాబు జగ్జీవన్ రామ్ Dr. BR అంబెడ్కర్ల విగ్రహాలకు పుష్పమాలతో సన్మానించి మహనీయులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు Dr. బాబు జగ్జీవన్ రామ్ దేశ రాజకీయ పరిపాలన దక్షత అనుభవాలు, సామాజిక న్యాయం కోసం ఆయన కృషిని గుర్తు చేసుకుంటూ అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో CH. భాస్కర్, బాలస్వామి, అగ్రవాసు, మహేష్, జనార్దన్, కె.శ్రీనివాస్, అజామ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.