ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ CPR శిక్షణ కార్యక్రమము

ఆకస్మిక గుండె పోటు పై అవగాహన

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ CPR శిక్షణ కార్యక్రమము

 

జూన్ 06, నల్లా సమాచార్ న్యూస్ / హఫీజ్ పేట డివిజన్:

ఈరోజు ఉదయం హఫీజ్ పేట డివిజన్ పరిధిలో గల హుడా కాలనీ మెయిన్ పార్క్ నందు వాకర్స్ కు, మహిళ సంఘాల వారికి మరియు కాలనీ వాసులకు CPR శిక్షణ కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో సిటిజన్ హాస్పిటల్, నల్లగండ్ల వారి సౌజన్యంతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ M.శ్రీధర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్, ఎమర్జన్సీ సర్వీసెస్ వారు విచ్చేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవము గుండె. ఇది శరీరంలో ఛాతి, ఊపిరితిత్తుల మధ్య ఉంటుంది. గుండె ఆక్సిజన్, పోషకాలను రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది. అయితే మారిన జీవనశైలి మరియు ఆహార అలవాట్ల వలన ప్రస్తుతం వయస్సు మరియు లింగ భేదంతో సంబంధం లేకుండా చాలా మందిలో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉన్న యువతలో కూడా ఆకస్మిక గుండెపోటు రావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న విషయం. గుండె లోని రక్తనాళాలలో బ్లాకులు (పూడికల) వల్ల రక్తప్రసరణకు అవరోధం ఏర్పడుతుంది. ఈ కారణంగా రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోతుంది. దీని ఫలితంగా గుండెపోటు (హార్ట్ ఎటాక్) వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రథమ చికిత్స (ఫస్ట ఎయిడ్) తెలిసి ఉండాలి. ఎవరైనా గుండెనొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటే ఫస్ట్ ఎయిడ్ చేసేముందు అంబులెన్స్ కు ఫోన్ చేయాలి. తరువాత ఆస్పిరిన్ టాబ్లెట్ వేయాలి. అప్పుడు కరోనరీ ఆర్థరీస్ లో బ్లడ్ క్లాట్స్ అనేవి బ్రేక్ డౌన్ అవుతాయి. దాంతో బ్లడ్ ఫ్లోకి ఎటువంటి ఇబ్బంది కలుగదు. దీంతో ఎటువంటి ప్రాణహాని జరుగదు. ఒకవేళ మీరు డ్రైవింగ్ చేసే సమయంలో గుండె నొప్పిగా అనిపిస్తే వెంటనే డ్రైవింగ్ చేయడం ఆపివేయాలి. ఎప్పుడైతే హార్ట్ ఎటాక్ ఎదుర్కొన్న వ్యక్తి ఊపిరి తీసుకోలేక పోతున్నాడో లేక పల్స్ అందడంలేదో అప్పుడు CPR ప్రక్రియ చేయాలి. CPR అంటే కార్డియో పల్మనరీ రెసస్కిటేషన్ ని ఎప్పుడైతే నిర్వహిస్తారో రక్త సరఫరా జరిగి కొంత సమయం ప్రాణాలతో ఉండగలరు. CPR నిర్వహించేటప్పుడు కేవలం మీ చేతులను మాత్రమే గట్టిగా పుష్ చేయాలి. ఛెస్ట్ మధ్యభాగంలో పుష్ చేసేటప్పుడు కొంత వేగంగా పుష్ చేయాలి. నిమిషానికి వంద నుండి నూట ఇరవై కంప్రెషన్ల వరకు చేయవచ్చు. ఇదే విధంగా అంబులెన్స్ వచ్చే వరకు లేదా మెడికల్ హెల్ప్ అందే వరకు చేయవచ్చు. ఇలా చేసి ప్రాణాలను కాపాడవచ్చు. కావున దీనిపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండటం చాలా అవసరం అని తెలిపారు. గుండెపోటు లక్షణాలు, గుండెలో ఆకస్మికంగా నొప్పి రావడమే కాక, అది మెడ వరకు పాడుతుంది. ఆకస్మిక మైకము, వికారముతో చెమటలు పట్టి శరీరమంతా చల్లగ అయిపోతుంది. ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఛాతిలో నొప్పి ప్రారంభమై ఎడమ చేయి, ఎడమ దవడ మరియు కుడిచేతి వరకు ఈ నొప్పి వ్యాపిస్తుంది. గుండె సంబంధిత సమస్యలు ఉంటే, గుండె సాధారణం కంటే ఎక్కువ కొట్టుకుంటుంది” అని తెలిపారు. “ఆరోగ్యమే మహా భాగ్యము కావున ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉండాలంటే మధుమేహం మరియు కొలస్ట్రాలను నియంత్రణలో పెట్టుకోవాలి. ధూమపానం, మద్యపానము మరియు మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలి. నిత్య వ్యాయామం, నడక, మెడిటేషన్ ఒక నలభై నిమిషాలు చేయాలి. ప్రతి రోజు తాజా ఆకుకూరలు, కూరగాయలు, సీజనల్ ఫ్రూట్స్, నట్స్ మరియు డ్రై ఫ్రూట్స్, మొలకలతో పాటు పీచు మరియు క్యాల్షియం అధికంగా ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. కనీసం ఐదు నుండి ఆరు గంటలు నిద్ర పోవాలి. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకున్న యెడల గుండెపోటుకు దూరంగా ఉండవచ్చు” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ నాయకులు దశరధ రామయ్య, ప్రభాకర రావు, జగన్ యాదవ్, కాళేశ్వర్ రావు మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ధర్మసాగర్, బాలరాజు, కుమారి మరియు హస్పిటల్ ప్రతినిధి హరీష్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.