మద్యం మత్తులో కత్తిపీటతో భార్యపై దాడి చేసిన భర్త

మద్యం మత్తులో కత్తిపీటతో భార్యపై దాడి చేసిన భర్త

జనవరి 05, నల్లా సమాచార్ న్యూస్ / బచ్చన్నపేట :

బచ్చన్నపేట మండల పోలీస్ స్టేషన్ ఎస్సై సతీష్ తెలిపిన వివరాల ప్రకారం దండుగుల లక్ష్మికి కొడవటూరు గ్రామానికి చెందిన దండుగుల నరేష్ తో 18 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. అయితే నరేష్ మద్యానికి బానిసై తరచూ లక్ష్మీని కొడుతూ శారీరకంగా మానసికంగా చిత్రహింసలు పెట్టేవాడు అని తెలిపారు. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం లక్ష్మి తన ఇంట్లో పెట్టిన డబ్బులు కనిపించడం లేదని నరేష్ ను అడగగా అందుకు కోపంతో నరేష్ లక్ష్మిని నాన్న బూతులు తిట్టి చంపాలనే ఉద్దేశంతో ఇంట్లో ఉన్న కత్తిపీట తన వెంట తెచ్చుకొని లక్ష్మీ మెడ పై నరకగా ఆమె చేయి అడ్డుపెట్టగా చేతికి బలమైన గాయమైంది. తీవ్రమైన రక్తస్రావంతో ఉన్న ఆమెను వెంటనే అక్కడే ఉన్న లక్ష్మీ కొడుకు ఆమెను జనగామ జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లి అడ్మిట్ చేశాడు. లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బచ్చన్నపేట ఎస్సై సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం నరేష్ ను రిమాండ్ కి పంపడం జరిగింది అని ఎస్సై సతీష్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.