అర్హులైన ప్రతి ఇంటికి పథకాలు అందేలా చూస్తాం: వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

అర్హులైన ప్రతి ఇంటికి పథకాలు అందేలా చూస్తాం వి జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే 6పథకాల అమలుకు శ్రీకారం చుటింది..

అర్హులైన ప్రతి ఇంటికి పథకాలు అందేలా చూస్తాం..

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి) శేరిలింగంపల్లి నియోజకవర్గం.

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని చందనగర్ డివిజన్ వార్డ్ కార్యాలయంలో మరియు లింగంపల్లి డివిజన్ తారణగర్ నందు ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పర్యటించి దరఖాస్తులను పరిశీలించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

ప్రజలందరూ ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రజాపాలన కార్యక్రమం నేటి నుంచి జనవరి 6 వ తేదీ వరకు ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీల పథకాలు అర్హులైన పేద ప్రజలకు అందించే విధంగా అధికారులు,ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలన్నారు.ప్రజల నుంచి మహాలక్ష్మి,అభయ హస్తం,రైతు భరోసా,ఇందిరమ్మ ఇండ్లు,గృహజ్యోతి,చేయూత పథకాలకు సంబంధించిన దరఖాస్తులను నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని,రాజకీయాలకు అతీతంగా లబ్దిదారులను ఎంపిక చేయాలని తెలిపారు.క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని,అర్హులైన లబ్ధిదారులందరు దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగ పరుచుకోవాలని అన్నారు.

 

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు కృష్ణ ముదిరాజ్,రఘునందన్ రెడ్డి,శేఖర్ ముదిరాజ్,శ్రీనివాస్ రెడ్డి,విరేశం గౌడ్,అజిమ్ ఖాన్,చందనగర్ డివిజన్ అధ్యక్షులు అలీ,లింగంపల్లి డివిజన్ అధ్యక్షులు జంజీర్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజన్,సోషల్ మీడియా కన్వీనర్ శ్రీహరి గౌడ్,నాయకులు గౌస్,షఫీ,ప్రసాద్ ముదిరాజ్,అజిముద్దీన్,ప్రవీణ్ కుమార్,మిరాజ్,అజామ్,నర్సింగ్ రావు,నందు యాదవ్,పాషా,సాయి కిషోర్,రవి,రాంబాబు,మహిళలు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.