కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు :వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న 6పథకాలు ప్రజలకు అందేలా చూస్తాం..

-శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటా,ప్రతి ఓటర్ ని కలుస్తా,ప్రతి బస్తి అభివృద్ధికి కృషి చేస్తా..

– శేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్

 డిసెంబర్ 24, నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్లా సంజీవరెడ్డి) శేర్లింగంపల్లి:

పీజేఆర్ నగర్,అల్విన్ కాలనీ డివిజన్

కాంగ్రెస్ పార్టీతోనే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని,రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 పథకాలు ప్రతి కుటుంబానికి అందేలా కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు ఒక సైనికుడిలాగా పని చేస్తూ ముందుకు సాగుతారని తెలిపారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..

ఈరోజు అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ బస్తీలో ప్రతి ఇంటి గడప వద్దకే వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు,అక్కడిక్కడే సంబంధిత అధికారులకు సమస్యను తెలియచేసారు వి.జగదీశ్వర్ గౌడ్ .శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి,ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నాయకత్వంలో బడుగు బలహీన వర్గాలకు సమగ్ర న్యాయం చేసేలా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు..

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భాను ప్రసాద్, సీనియర్ నాయకులు సాంబశివరావు, డివిజన్ అధ్యక్షులు మరేళ్ల శ్రీనివాస్, గోపాల్, ప్రభాకర్, శశి, రవి, సంగమేష్, వెంకటేష్, రాజు, ప్రదీప్, అగ్రవాసు, మురళి గౌడ్, రెహ్మాన్, కన్నా,పండు, మహిళలు శిరీష సత్తుర్,స్వరూప,అంజలి తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.