Allwyn Colony Division ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనలకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన

Allwyn Colony Division ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనలకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, సంరక్షణ,అభివృద్ధి పనులలో భాగంగా రూ. 2 కోట్ల 74 లక్షల రూపాయలతో నూతనంగా చెరువులో మురుగు నీరు కలవకుండా చేపడుతున్న మురుగు నీటి మల్లింపు పైప్ లైన్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ఆరెకపూడి గాంధీ

 

నల్లా సమాచార్ న్యూస్, హైదరాబాద్:ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు సుందరికరణ, సంరక్షణ,అభివృద్ధి పనులలో భాగంగా రూ. 2 కోట్ల 74 లక్షల రూపాయలతో నూతనంగా చేపడుతున్న చెరువులో మురుగు నీరు కలవకుండా చేపడుతున్న మురుగు నీటి మల్లింపు పైప్ లైన్ నిర్మాణం పనులకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ , మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావులతో కలిసి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

 

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఎల్లమ్మ చెరువు సుందరికరణ, సంరక్షణ,అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది అని, చెరువులో కలుషిత నీరు కలవకుండా చేపడుతున్న డ్రైనేజి వ్యవస్థ మల్లింపు పనులకు ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగినది, డ్రైనేజి వ్యవస్థ మల్లింపు పైప్ లైన్ నిర్మాణం పనులకు వేగం పెంచాలని,పనులు నాణ్యత ప్రమాణాలతో చేపెట్టాలని,నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు, చుట్టుపక్కల కాలనీల నుండి వచ్చే మురుగు నీరు చెరువులో కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ,చెరువు చుట్టుపక్కల నివసిస్తున్న కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని, మురుగు నీటి మల్లింపు పైప్ లైన్ ద్వారా చెరువులో కలుషిత నీరు కలవకుండా సస్యశ్యామలంగా ,చక్కటి ఆహ్లదకరంగా చెరువును పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతామని , చెరువు చుట్టు పక్కల కాలనీల ప్రజలకు ఎంతగానో సాంత్వన నేటితో చేకూరిందని ఎమ్మెల్యే గాంధీ తెలియజేసారు ,ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని పనులు వేగవంతం చేయాలని, పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. అదేవిధంగా చెరువు సుందరీకరణలో భాగంగా చెరువు కట్ట పటిష్ట పరిచేలా పునరుద్ధరణ , మురుగు నీరు చెరువు లో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి మల్లింపు (UGD) పైప్ లైన్ నిర్మాణం మరియు అలుగు మరమ్మత్తులు, చెరువు కట్ట బలోపేతం ,పునరుద్దరణ పనులు, వాకింగ్ ట్రాక్ వంటి పనులు చేపడుతామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. చెరువు సంరక్షణ లో భాగంగా చెరువు చుట్టూ ఫెన్సిగ్ (కంచె) నిర్మాణం మరియు చెరువు యొక్క అలుగు నిర్మాణము మరియు చెరువు సుందరికరణ పనులు చేపడుతున్నాం అని ,చెరువు సుందరికరణ మరియు అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అధికారులకు తెలియచేశారు అదేవిధంగా ప్రణాళిక తో పనులు చేపట్టాలని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు .అదేవిధంగా చెరువులను సంరక్షణిచడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం అని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. అదేవిధంగా ఎల్లమ్మ చెరువును సుందరవనం గా ,శోభితవర్ణం గా తీర్చిదిద్దుతామని, అదేవిదంగా చెరువు ల చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి చెరువు ల ను సంరక్షిస్తామని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు .చెరువు ల UGD మల్లింపు పైప్ లైన్ నిర్మాణం పనుల గూర్చి అధికారులకు పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది .చెరువు అపరిశుభ్రం వలన పేరుకుపోయిన గుర్రపు డెక్క వలన దోమల పెరగడం వలన స్థానికులకు ఏర్పడుతున్న ఇబ్బందులను ,అనారోగ్యాలకు గురవడం స్థానికులు పలుమార్లు ఎమ్మెల్యే కి పిర్యాదు చేయడం వలన దీనికి స్పందించిన ఎమ్మెల్యే స్థానికులు పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి చెరువును దత్తత తీసుకొని సొంత నిధులతో చెరువును శుభ్రపరిచి సుందరీకరణ చేసిన సంగతి విదితమే .అదేవిధంగా ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తామని చెప్పడం జరిగినది , తామర పువ్వులను పెంచి కలుషితం కాకుండా చెరువును సుందరీకరిస్తామని ఎమ్మెల్యే గాంధీ చెప్పటం జరిగినది .చెరువులను సుందరీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ,చెరువులు కలుషితం కాకుండా మరియు కబ్జాలకు గురికాకుండా చెరువులను పూర్తి స్థాయిలో సంరక్షిస్తామని , చెరువు చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేసి ,ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తామని,అలాగే నియోజకవర్గం లోని అన్ని చెరువులను పూర్తి స్థాయిలో సుందరీకరిస్తామని ఎమ్మెల్యే చెప్పటం జరిగినది చెరువుల పరిరక్షణకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,ఉద్యమకారులు,బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు, మహిళలు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.