అక్రమంగా నిర్మిస్తున్న భవనంపై చర్యలు తీసుకోవాలి

అక్రమంగా నిర్మిస్తున్న భవనంపై చర్యలు తీసుకోవాలి

అక్రమంగా నిర్మిస్తున్న భవనంపై చర్యలు తీసుకోవాలి

టౌన్ ప్లానింగ్ అధికారికి కాంగ్రెస్ నేత ఫిర్యాదు

 

చందానగర్ సర్కిల్ పరిధిలోని మియాపూర్ సర్వేనెంబర్ 41 లోని ప్లాట్ నెంబర్ 59 ఏ 100 గజాలలో (6)ఆరంతస్తుల అక్రమ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది. ఇది నగరంలోని నడిబొడ్డున అత్యంత రద్దీ ప్రాంతంలో ఉంది. ఈ అక్రమ నిర్మాణం పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మియాపూర్ డివిజన్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ముద్దంగుల తిరుపతి టౌన్ ప్లానింగ్ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు పరిమితులకు మించి, షరతులకు లోబడి నిర్మాణం జరగడంలేదని, ఇది అత్యంత ప్రమాదకరంగా మారిందని తెలిపారు. భవనానికి తీసుకోవాల్సిన అనుమతులు ఏమీ లేవని వెంటనే నిర్మాణ పనులు ఆపాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. అగ్నిమాపక నిబంధనలు ఏమీ లేవని ఏదైనా ప్రమాదాలు జరిగితే ఎవరూ బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నించారు… ప్రమాదకరంగా జరుగుతున్న నిర్మాణంపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు

Leave A Reply

Your email address will not be published.