Hafeezpet division : మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన హఫీజ్ పేట్ డివిజన్ కార్పోరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్
మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం పర్యవరణాన్ని కాపాడుకుందాం
హఫీజ్ పేట్ డివిజన్ కార్పోరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్
సెప్టెంబర్ 17, నల్లా సమాచార్ న్యూస్ / హఫీజ్ పేట్ డివిజన్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి):
పర్యావరణ హితమే లక్ష్యంగా హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ వినాయక చవితి సందర్భంగా హఫీజ్ పేట్ డివిజన్ వార్డ్ కార్యాలయంలో ఈరోజు మట్టి గణపతి విగ్రహాలను కార్పొరేటర్ చేతులమీదుగా డివిజన్ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, పర్యావరణాన్ని పరిరక్షించి భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, అందమైన సమాజాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది కాబట్టి మట్టి విగ్రహాలను పూజించి వినాయక పండుగ ఘనంగా జరుపుకోవాలని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు, నివాసితులు, మహిళలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.