అభివృద్ధి పనులకు నియోజకవర్గానికి రు.10కోట్లు: ఇన్చార్జి మంత్రుల అనుమతితో పనులు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు

అభివృద్ధి పనులకు నియోజకవర్గానికి రూ.10కోట్లు: ఇన్చార్జి మంత్రుల అనుమతితో పనులు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు

అభివృద్ధి పనులకు 119 శాసన సభ నియోజకవర్గాలకు 1,190 కోట్లు మంజూరు‌ చేసిన ప్రభుత్వం.

ఇన్చార్జి మంత్రుల అనుమతితో పనులు చేపట్టాలని స్పష్టమైన ఆదేశం

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి)

అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతి శాసన సభ నియోజకవర్గానికి 10 కోట్ల చొప్పున రాష్ట్రంలోని మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాలకు 1,190 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది . అభివృద్ధి పనుల మంజూరుకు సంబంధించి కలెక్టర్లు ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జిలుగా ఉన్న మంత్రుల అనుమతి పొందాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది .ప్రతి నియోజకవర్గంలో రెండు(2) కోట్లు విద్యకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనకు, (1)ఒక కోటి తాగునీటికి 50 లక్షలు కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహణకు ఖర్చు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మిగిలిన నిధులు ఇతర అభివృద్ధి పనులకు ఖర్చు చేయనున్నారు. ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్ ఆదేశాలు జారీ చేశారు.

మంత్రుల అనుమతి పొందిన తరువాత పనుల అంచనాలు ఎస్సీ, ఎస్టీ సహా కేటగిరీల వారిగా వివరాలను ప్రణాళికా శాఖకు పంపాలని సూచించారు. తాజాగా చేపట్టే పనులు గతంలో ఏ పథకం కింద చేపట్టి ఉండకూడదని తెలిపారు .ఈ క్రమంలో నిబంధనలు పాటించడంతోపాటు నిర్దేశించిన ప్రమాణాల మేరకు పనులు జరగాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.