గత 30 సంవత్సరాలుగా నివాసాలు ఏర్పరచుకొని నివాసముంటున్న పేద ప్రజల ఇళ్లకు పట్టాలు ఇవ్వాలి:ఎంసీపీఐ(యు)

గత 30 సంవత్సరాలుగా నివాసాలు ఏర్పరచుకొని నివాసముంటున్న పేద ప్రజల ఇళ్లకు పట్టాలు ఇవ్వాలి

 

నల్లా సమాచార్ న్యూస్: హైదరాబాద్

మియాపూర్ ప్రభుత్వ భూముల్లో గత 30 సంవత్సరాలుగా నివాసాలు ఏర్పరుచుకొని ఉంటున్న పేద ప్రజల ఇళ్ళకు పట్టాలు ఇవ్వాలి

 

HMDA అధికారాలు ఇస్తున్న నోటీసులను ఉపసహరించుకోవాలి

 

భారీగా కదిలిన ముజఫర్ అహ్మద్ నగర్ ప్రజలు

 

ఈరోజు ఎంసీపీఐ(యు) ఆద్వర్యంలో రంగారెడ్డి కలక్టర్ ఆఫీసు ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు తుడుం అనిల్ కుమార్ హాజరై నారు వారు మాట్లాడుతూ

మియాపూర్ ప్రభుత్వ భూముల్లో గత 30 సంవత్సరాలుగా నివాసాలు ఏర్పరుచుకొని ముజఫర్ అహ్మద్ నగర్లో ఉంటున్న పెద ప్రజల ఇళ్ళకు గత నెల 27 నుండి HMDA అధికారాలు కాళి చేయాలని నోటీసులు ఇవ్వడం అన్యాయం అని అని అన్నారు పెద్ద భూభకాసురులను వదిలి పెద వాళ్లకు నోటీసులు ఇచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురుంచేయడం సరైన పద్ధతి కాదు ఇదేనా ప్రజల పాలన అంటే అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇస్తున్న నోటీసులను ఉపసహరించుకొని వారి ఇళ్లకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు

 

•పార్టీ మియాపూర్ డివిజన్ సహాయ కార్యదర్శి పల్లె మురళి మాట్లాడుతూ

భూభాకాసురులు, కబ్జాదారుల పై అనేక ఫిర్యాదులు చేశాము వాటిని కనీసం పట్టించుకోని అధికారులు పెదాలపై ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తుంది అని మియాపూర్ ప్రాంతంలో అనేక సంవత్సరాలు గా ఉంటున్న పెద ప్రజల బస్తీల జోలికి వొస్తే ఎంసీపీఐ(యు) రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తామని ప్రజలకు పార్టీ అండగా ఉంటుంది అదే విధంగా వాళ్ళిచిన నోటీసులకు చట్టపరంగా సమాధానం చెప్తం అని అన్నారు.

అనంతరం కలెక్టర్ కు వినతి ఇవ్వడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి స్థానికి MRO కి సమస్యని రిఫర్ చేశారు.

 

ఈ కార్యక్రమాల్లో పార్టీ కార్యవర్గ సభ్యులు కుబుం సుకన్య, తుకారాం నాయక్, మహిళా సంఘ నాయకుల అంగడి పుష్ప,అనితా శివాని,సుల్తాన్ బేగం, రజియా బేగం, పార్టీ నాయకులు చందర్, కె.వెంకటేష్, కే.సుభాష్. స్థానిక బస్తి ప్రజలు హాజరైనారు.

Leave A Reply

Your email address will not be published.