సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి సందర్భంగా గిరిజన బిడ్డలకు శుభాకాంక్షలు.

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్

గిరిజనుల ఆరాధ్య దైవం సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ హారాజ్

సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి సందర్భంగా గిరిజన బిడ్డలకు శుభాకాంక్షలు.

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్

ఫిబ్రవరి 15, నల్లా సమాచార్ న్యూస్ / శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ మియపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండాలో నిర్వహించిన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి వేడుకల్లో పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బంజారా సోదరులను కలవడమంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలుసుకున్నంత ఆనందంగా ఉందని, 1976లో ఇందిరమ్మ నాయకత్వంలో బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చారు.రాష్ట్ర స్ధాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో బంజారాలు కీలక పాత్ర పోషిస్తున్నారని, దామాషా ప్రకారం నిధులు కేటాయించిన ఘనత సోనియాగాంధీదే అని. దొరల రాజ్యం పోవాలి.. పేదల రాజ్యం రావాలని మీరు నినదించారు.మీ ఆశీర్వాదంతో తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, అన్ని తండాల్లో పాఠశాలలు నిర్మించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. చదువులను తండాకు తీసుకెళ్లే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని తెలిపారు..

ఈ కార్యక్రమంలో నాయకులు వీరేందర్ గౌడ్,నల్ల సంజీవ రెడ్డి, మనెపల్లి సాంబశివరావు, కృష్ణ గౌడ్, తిరుపతి, మాదాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేష్ నాయక్, గోపాల్ నాయక్,బాలు నాయక్, శివ, రవి, తండా ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.