చదువుకున్నప్పుడే సమాజంలో గౌరవం

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్

చదువుకున్నప్పుడే సమాజంలో గౌరవం

చదువుల బాట పట్టండి

సంత్ సేవాలాల్ మార్గంలో నడవండి.

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్

ఫిబ్రవరి 15, నల్లా సమాచార్ న్యూస్ / శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ బస్తీలో నిర్వహించిన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి వేడుకల్లో పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదల రాజ్యం రావాలని మీరు నినదించారు.మీ ఆశీర్వాదంతో తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, గెలుపోటములతో సంబంధం లేకుండా 70 రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా మేం సెలవు తీసుకోలేదని,మీ కోసం,మీ అభ్యున్నతి కోసం కష్టపడే ప్రభుత్వం వచ్చింది,మీ అభివృద్ధి కోసం మా ప్రభుత్వం కృషి చేస్తుందని,కరెంటు,తాగునీరు ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావలని, సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడేగా ప్రభుత్వం నిర్ణయించిందని,సేవాలాల్ జయంతి ఉత్సవాలు జరిపేందుకు కోటి కాదు..మరో కోటి జత చేసి రాష్ట్ర ప్రభుత్వం రూ.2కోట్లు విడుదల చేసిందని.వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయండి. ఈ కార్యక్రమంలో కూన సత్యం గౌడ్, నల్ల సంజీవ రెడ్డి, వీరేందర్ గౌడ్, మనెపల్లి సాంబశివరావు, కృష్ణ గౌడ్, తిరుపతి, అల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు మరేళ్ల శ్రీనివాస్, మాదాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేష్ నాయక్,శశి,దినేష్ తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.