మీరు ఎన్నన్నా చెప్పండి 1983లో కపిల్ డెవిల్స్ కనుక వన్డే వరల్డ్ కప్ కనుక గెలవక పోయి ఉంటే….

మీరు ఎన్నన్నా చెప్పండి 1983లో కపిల్ డెవిల్స్ కనుక వన్డే వరల్డ్ కప్ కనుక గెలవక పోయి ఉంటే....

మీరు ఎన్నన్నా చెప్పండి!

భారత్ లో క్రికెట్ ని ఒక ఆటగా కాకుండా క్రికెట్ నీ ఒక భక్తిగా భావించేట్లుగా చేసింది కపిల్ దేవ్ మాత్రమే!

1983 లో కపిల్ డెవిల్స్ కనుక వన్డే వరల్డ్ కప్ కనుక గెలవక పోయి ఉంటే ఈ రోజున మనదేశంలో క్రికెట్ ఈ దశలో ఉండేది కాదు!

కొంచెం అతిశయోక్తి గా ఉందేమో కదా?

కానీ నిజం మాత్రం ఇదే!

1983 వన్ డే వరల్డ్ కప్ ఇంగ్లాండ్ లో జరుగుతున్న సమయంలో కేవలం రేడియోలో కామెంటరీ వినడం తప్పితే వేరే ఎలాంటి కమ్యూనికేషన్ సౌకర్యం లేదు. అదీ షార్ట్ వేవ్ లో బిబిసి వాడి కామెంటరీ ఎలా వినపడేది అంటే ఆగి ఆగి వినపడేది. ట్రాన్సిస్టర్ రేడియో తీసుకొని ఎత్తైన ప్రదేశంలోకి వెళితే కొంచెం క్లియర్ గా వినపడేది.

ఇక దినపత్రిక ప్రింటింగ్ అనేది అర్ధరాత్రి లోపే ప్రింట్ అయి ఉదయాన్నే డెలివరీ అయ్యేవి కాబట్టి నిన్న అర్ధరాత్రి లేదా తెల్లవారుఝామున జరిగిన వార్త మరుసటి రోజు పేపర్ లొ చదువుకోవాల్సిందే!

కపిల్ డెవిల్స్ వన్డే వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెల్లవారి 6 గంటలకి మిత్రులు ఇంటికి వచ్చి చెప్పి ఆనందం తో బల్లి గుడ్లు చేతిలో పెట్టీ నోరు తీపి చేసుకోమన్నారు!

బల్లి గుడ్లు అంటే చిన్న చిన్న తీపి గుళికలు అన్నమాట! అవే మాకు పుల్లారెడ్డి స్వీట్స్ అప్పట్లో!

**********************

కపిల్ దేవ్ నిఖంజ్!

ఈ హర్యానా హరికేన్ మాకు ఆరాధ్యుడు అప్పట్లో!

కపిల్ దేవ్ బౌలింగ్ యాక్షన్ చాల ఫెమస్ అప్పట్లో. కానీ చూడడానికి చాలా బాగుండేది.

ఎందుకింత ప్రశంస?

BCCI దగ్గర డబ్బులు లేవు 1983 లో !

ఆటగాళ్ళ తో పాటు జట్టు మేనేజర్ మాత్రమే ఇంగ్లాండ్ వెళ్ళాడు!

కపిల్ దేవ్ కెప్టెన్ గా ఇంగ్లాండ్ వెళ్ళినా పెద్దగా చెప్పుకోతగ్గ వ్యక్తిగత రికార్డ్స్ ఏమీ లేవు తనకి. మాలాంటి టీనేజర్స్ కి పెద్ద ఆశలు లేవు భారత జట్టు మీద!

కానీ ఒక అద్భుతం జరిగింది అప్పుడు!

భారత్ సెమీ ఫైనల్ కు వెళ్ళాలి అంటే జింబాబ్వే మీద గెలవాలి లేకపోతే ఇంటికి వచ్చేయడమే!

మాకెవ్వరికీ భారత జట్టు జింబాబ్వే మీద గెలుస్తుంది అన్న ఆశలు లేవు.

షరా మామూలు గా ఓపెనర్లతో తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా కుప్ప కూలిపోయిన వేళ టెయిల్ ఎండర్ గా వచ్చిన కపిల్ దేవ్ 175 నాట్ అవుట్ 138 బాల్స్ లో జింబాబ్వే మీద విజయం సాధించిపెట్టాడు! ఇందులో 16 బౌండరీలు,6 సిక్సర్లు ఉన్నాయి.

1983 లో కపిల్ రికార్డు 175 నాట్ అవుట్ తరువాత 27 సంవత్సరాల కాలం పాటు భద్రంగా కపిల్ దేవ్ మీదనే ఉంది!

కపిల్ 175 నాట్ అవుట్ ఇప్పటికీ టాప్ టెన్ వన్డే ఇనింగ్స్ లో 4 వస్థానంలో ఉంది!

కపిల్ దేవ్ తో పాటు భారతీయుల దురదృష్టం ఏమిటంటే కపిల్ 175 నాట్ అవుట్ కొట్టిన రోజు బిబిసి సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు కాబట్టి ఆ రోజు వీడియో రికార్డింగ్ చేయలేదు.

అదే ఆ రోజు వీడియో రికార్డింగ్ ఉండి ఉంటే ఇప్పటికీ ఆ వీడియో వైరల్ లో ఉండేది!

మరుసటి రోజు పేపర్ లో వార్త చదివి ఆశ్చర్య పోయాం! వన్డే క్రికెట్లో లో 175 నాట్ అవుటా? విచిత్రం ఏమిటంటే రెండు రోజులపాటు జిడ్డు ఆట ఆడి సెంచరీ చేసే గవాస్కర్ మాత్రమే మాకు తెలుసు అదీ టెస్ట్ క్రికెట్లో!

అలాంటిది వన్ డే వరల్డ్ కప్ లో 175 నాట్ అవుట్ అదీ టెయిల్ ఎండర్ గా వచ్చి!

అదుగో కపిల్ దేవ్ మీద భారత జట్టు గెలుపు మీదా మొదటి సారి ఆశలు చిగురించాయి మాకు!

అరివీర భయంకరమయిన ఫాస్ట్ బౌలర్లు, బ్యాట్స్మన్ ఉన్న వెస్ట్ ఇండీస్ తో ఫైనల్ మాచ్ ఆడాలి భారత్!

అప్పటికే రెండు సార్లు విశ్వవిజేతగా ఉన్న వెస్ట్ ఇండీస్ ను భారత జట్టు ఎదుర్కోలేదు అంటూ బ్రిటన్ మీడియా ముందస్తు వార్తలు వ్రాశాయి భారత జట్టు ను మానసికంగా దెబ్బ కొట్టే ప్రయత్నంలో భాగంగా!

కానీ కపిల్ డెవిల్స్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వెస్ట్ ఇండీస్ ను ఓడించి టైటిల్ను కైవసం చేసుకుంది!

***********************

లండన్ నుండి బొంబాయి చేరుకున్న భారత జట్టు కి ఘనస్వాగతం పలకడానికి BCCI దగ్గర డబ్బులు లేవు!

బొంబాయి BEST సిటీ బస్ (డబుల్ డెక్కర్) మీద కపిల్ దేవ్ తో పాటు జట్టు సభ్యులను కూర్చోబెట్టి ఊరేగించారు!

సన్మానం చేయడానికి డబ్బులు లేకపోతే విషయం తెలుసుకున్న గాయని లతా మంగెష్కర్ విరాళం అందించారు!

అందుకే ప్రతీ మ్యాచ్ కి వీఐపీ గ్యాలరీలో లతా మంగేష్కర్ గౌరవార్థం ఒక సీటు ఖాళీ గా ఉంచుతుంది బీసీసీఐ ఇప్పటికీ !

******************”””””

మరి ఇప్పుడు?

BCCI అత్యంత ధనిక బోర్డు! ICC ను శాసిస్తుంది బీసీసీఐ!

వరల్డ్ క్లాస్ జిమ్ లు ఉన్నాయి బీసీసీఐ కి. వరల్డ్ క్లాస్ ట్రైనర్లు ఉన్నారు ఆటగాళ్లకు ఫిట్నెస్ ట్రైనింగ్ ఇవ్వడానికి. బోలింగ్ కొచ్, బ్యాటింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్ లు ఉన్నారు.

ప్రత్యర్థి జట్టు బలాలు,బలహీనతలు ఏమిటో చెప్పడానికి డిజిటల్ వీడియో రికార్డింగ్, ఎడిటింగ్ వ్యవస్థ ఉంది. ఒక్కో ఫ్రేం ను విశ్లేషిస్తూ ఆటగాళ్లకు ప్రత్యర్థి జట్టు బలహీనతలు చెప్పే వీలు ఉంది.

వరల్డ్ క్లాస్ ఫిజియో లు ఉన్నారు.

ఫైవ్ స్టార్ హోటల్లో మకాం!

కానీ 1983 తరువాత 2011 వరకూ వన్ డే వరల్డ్ కప్ కోసం ఎదురు చూడాల్సి వచ్చింది!

నిన్న T20 విజేత భారత్ జట్టుకి 120 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ను ప్రకటించింది బీసీసీఐ!

So! కపిల్ దేవ్ కి క్రెడిట్ ఇవ్వాల్సిందే!

సచిన్ టెండూల్కర్ కూడా కపిల్ దేవ్ ను స్ఫూర్తిగా తీసుకుని క్రికెట్ లోకి వచ్చాను అని అన్నాడు!

ఏమీ లేనప్పుడు సాధించినదే గొప్ప!

జైహింద్!

Leave A Reply

Your email address will not be published.