రేపే సిసిసి జనగామ యూట్యూబ్ ఛానెల్ లో లాహిరే లల్లాహిరే బోనాల పాట 2024 సాంగ్ విడుదల

రేపే సిసిసి జనగామ యూట్యూబ్ ఛానెల్ లో లాహిరే లల్లాహిరే బోనాల పాట 2024 సాంగ్ విడుదల

జూలై 11, నల్లా సమాచార్ న్యూస్ / జనగామ :

కల్చరల్ క్రియేటివ్ ఛానల్ జనగామ (సిసిసి జనగామ) అధ్వర్యంలో యూట్యూబ్ ఛానెల్ లో లాహిరే లల్లాహిరే బోనాల పాట 2024 డిజె పూర్తి ఈనెల 12న సాంగ్ విడుదలకు సంబంధించిన పోస్టర్ గురువారం జనగామ గణేష్ వాడలోని ఎల్లమ్మ టెంపుల్ వద్ద విడుదల చేశారు. జానపద కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు, సామాజిక చైతన్యం, ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి సిసిసి జనగామ ఛానల్ జనగామ కేంద్రం ఇటీవల ప్రారంభించారు. సిసిసి జనగామ యూట్యూబ్ చానల్ లో సాయంత్రం 6 గంటలకు పేక్షకులకు వీక్షించడానికి అందుబాటులో ఉండే ఈ పాట రచన, గానం పాడాల రాజమ్మ, నిర్మాత అయిలా సొమనర్సింహచారి, సంగీతం సత్య సోమేష్, సాంకేతిక సహకారం చిలుమోజు సాయికిరణ్ (జెఎస్కేకే ట్యూన్స్) అందించారు. ఈపాటను‌, ఛానల్ ను ప్రజలు అందించాలని, సబ్స్క్రైబ్, షేర్ ,లైక్, కామెంట్ రాసి ప్రోత్సాహం అందించాలని నిర్వాహకులు జి.కృష్ణ కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జి.కృష్ణ, అయిలా సొమనర్సింహచారి, చిలుమోజు సాయికిరణ్, లగిశెట్టి ప్రభాకర్, పెట్లోజు సోమేశ్వరాచారి, డాక్టర్ వేముల సదానందం, పొట్టబత్తిని భాస్కర్, అంబాల శివనాద్ గౌడ్, గడ్డం మనోజ్ కుమార్, తాళ్లపల్లి లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.