124 division ముదిరాజ్ యువజన సంఘం ఆత్మీయ సమ్మేళనం ముఖ్యఅతిథిగా హాజరైన పట్వారీ శశిధర్

124 division ముదిరాజ్ యువజన సంఘం ఆత్మీయ సమ్మేళనం ముఖ్యఅతిథిగా హాజరైన పట్వారీ శశిధర్

 

నల్లా సమాచార్ న్యూస్ :

(ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి 9849396606):

ఈ రోజు 124 డివిజన్ ఆల్విన్ కాలనీ ఎల్లమ్మ బండలలో ముదిరాజ్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పట్వారి శశిధర్ గారిని పిలవడం జరిగింది. పట్వారి శశిధర్ గారు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి తన వంతు కృషి, సలహాలు ,సూచనలు, తప్పకుండా ఇస్తానని ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు సంఘం అధ్యక్షులు నరసింహ సంఘ సభ్యులు శ్రీను, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. యువజన సంఘం తరఫున నవీన్ ను అధ్యక్షుడుగా మధు ను ఉపాధ్యక్షుడుగా భరత్ ను జనరల్ సెక్రటరీ గా నియమించడం జరిగింది. అనంతరం భోజన కార్యక్రమం నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.