ప్రతి కేంద్రంలో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయి: వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

ప్రతి కేంద్రంలో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయి: వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి)శేరిలింగంపల్లి నియోజకవర్గం

ప్రతి కేంద్రంలో ప్రజలకు అవసరాలకు అనుగుణంగా దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి…

సంక్షేమ పథకాల కొరకై ఏర్పాటు చేసిన దరఖాస్తు కేంద్రాలను పరిశీలించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..

28 డిసెంబర్ 2023 నుండి 6 జనవరి 2024 వరకు ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ.

ఈరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఫేస్-2 కాలనీ మరియు హైదరనగర్ డివిజన్ పరిధిలోని హెచ్.ఎం.టి హిల్స్ కమ్యూనిటీ హాల్ నంది సంక్షేమ పథకాల కోసం ఏరాటు చేసిన కేంద్రాలను పరిశీలించారు శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ గారు.

అన్ని సెంటర్ లలో అప్లికేషన్ ఫారం లు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని,ఎవరు కూడా సెంటర్లకు వెళ్లి డబ్బులు ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.అధికారులు అన్ని జాగ్రత్తలు తీస్కుంటున్నారని,ఏవైనా ఇబ్బందులుంటే అధికారులను నేరుగా సంప్రదించొచ్చు అని తెలిపారు .

సెంటర్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తో మాట్లాడి వివరాలు తెలుసుకొని,ప్రజలకు అన్ని విధాలా అర్ధం అయ్యేలా వివరించాల్సింది గా వారికీ సూచనా చేసారు

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు,నాయకులు,యూత్ సభ్యులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.